← కీర్తనలు

310. యేసు హృదయద్వారమును తట్టుట

రాగం: భైరవి|తాళం: ఆది|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయుఁ డగుచుఁ దట్టుచుండు సకల విధములను ||హృదయ||
1.  పరుని బోలి నిలుచున్నాఁడు పరికించి చూడ నతఁడు పరుఁడు గాఁ డు రక్షకుండు ప్రాణ స్నేహితుఁడు ||హృదయ||
2.  కరుణాశీలుం డతఁడు గానఁ గాచి యున్నాఁడు యేసు కరుణ నెఱి గి గారవింపఁ గరము న్యాయంబు ||హృదయ||
3.  ఎంత సేపు నిలువఁ బెట్టి యేడ్పింతు రతని నాతఁ డెంతో దయచే బిలుచుచున్నాఁ డిప్పుడు మిమ్ములను ||హృదయ||
4.  అతఁడు మిత్రుఁడతఁడు మిత్రుం డఖిల పాపులకు మిర లతని పిలుపు వింటి రేని యతఁడు ప్రియుఁడగును ||హృదయ||
5.  జాలిచేతఁ దన హస్తములఁ జాఁపి యున్నాఁడు మిమ్ము నాలిం గనము సేయఁ గోరి యనిశము కనిపెట్టు ||హృదయ||
6.  సాటిలేని దయగల వాఁడు సర్వేశు సుతుఁడు తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు ||హృదయ||
7.  చేర్చుకొనుఁడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతఁడు చేర్చు కొనుచు మీ కిచ్చును చిర జీవముఁ గృపను ||హృదయ||
8.  అతఁడు తప్పక కలుగఁజేయు నఖిల భాగ్యములు మీర లతని హత్తుకొందు రప్పు డానందముతోడ ||హృదయ||
9.  బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడఁ గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి ||హృదయ||