← కీర్తనలు

266. నిజసేవకుని లక్షణములు

రాగం: ధీరశంకరాభరణము|తాళం: ఆది|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు ||ఘన||
1.  వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ ||ఘన||
2.  తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు ||ఘన||
3.  వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు ||ఘన||
4.  మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు ||ఘన||
5.  జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్ ||జనక||