← కీర్తనలు

251. పరిశుద్ధాత్మ కుమ్మరింపు

రాగం: ఆనందభైరవి|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను వారి కవి యెంతో ధైర్యముల్ మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ చనుదెంచె వారిపై ||వినరే||
1.  పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై తన్నాదము ||వినరే||
2.  అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను నింపఁబడి రంత ||వినరే||
3.  వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ ||వినరే||
4.  ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని దయచేత ||వినరే||
5.  మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు కా నందమును గల్గు ||వినరే||