← కీర్తనలు

248. పరిశుద్ధాత్ముడా దిగిరమ్ము

రాగం: కమాసు|తాళం: త్రిపుట|రచయిత: వి.డి. జాన్ సుందరరావు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరిశుద్ధాత్మా పావురమా నీ దాసులపై కరుణతో నరుదెంచుమా పరిశుద్ధుడగు యేసు పరమున కరిగి యా దరణకర్తగ నిన్ను దయచేసె గద మాకు ||పరి||
1.  తండ్రి కుమారాత్మల యేకాత్మవై యుండిన పావనుడా నిండార నీ యాత్మ నండగ మాకొసగి దండిగ వరముల దయచేయు మోదేవ ||పరి||
2.  విధిగ వేదము జదివిన వేమారుసద్బోధల నాలించినా సదయుడ నీ శక్తి హృదయాల లేకున్న కదలింపబడలేని కలుషాత్ములము తండ్రి ||పరి||
3.  సత్యస్వరూపా రమ్ము మమ్ముల సర్వ సత్యములో నడుపుము సత్యాత్మా నీ శక్తి సంపత్తితో దైవ కృత్యము లొనరింప గ్రుమ్మరింపుమా శక్తి ||పరి||
4.  వాక్యమందలి భావముల్ లోతుగ దరచి వచియింప దరమె మాకు వాక్యోప దేశివిగా వచ్చి మాలో నిలచి వాక్యమందలి జీవ భావాలు దెలుపుమా ||పరి||
5.  సాధక బాధకముల నిలయంబైన సంసార సాంద్రములో ఆదరణ కర్తవుగా నరుదెంచి మా సర్వ బాధల దొలగించి మోదంబు గూర్చుమా ||పరి||