కీర్తనలు

244. పరిశుద్ధాత్మా, రమ్ము

రాగం: ఆనందభైరవి|తాళం: అట|రచయిత: కడియం గాబ్రియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య వరుఁడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు మయ్య ||పరి||
1.  బలమౌ నీ వెలుఁగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యముఁ గలిగించి విశ్వాస మున వారి నొనఁగూర్చి వెలయుచుండెడు నీకే విన తుల్ సల్పుదు మయ్య ||పరి||
2.  బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుఁగా! ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మదితోడఁ బిలువఁ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ బల వాక్య మిడు మాకుఁ ||పరి||
3.  విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని యవనిం బ్రతుక నిమ్ము ||పరి||
4.  పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్తా జరిగింప నీ యాజ్ఞలన్ త్వర నొందు చరణములు స్థిర డెందమును నిమ్ము పరిశోధనలు గలుగ భయమొంద నీయకుము ||పరి||
5.  మరణ జీవంబు ల స్థిర యోధులను బోలి పరుగెత్త నీ దారినే తిరతఁ దప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమతో నిడి సిద్ధ పరచుము మము ప్రభువా ||పరి||