పల్లవి:
మహిమతో మన యేసు ఇహమునకు వేంచేయున్ సహోదరులారా మన మా మహిమలో వెలుఁగుదుము ||మహిమతో||
1. మోములు వంచి యేసు నామము నుతియించు పామరులమైన మనలఁ బ్రేమతోఁ గప్పినాఁడే ||మహిమతో||
2. పాత్రులమా మనము శత్రులమే కాదా మిత్రులన్ జేసిన వి చిత్రము తెలియలేము ||మహిమతో||
3. శిరముల పైని జీవ కిరీటములతోను బరమ దేవుని వరములు మురి యుచు మరువలేము ||వచుహిమతో||
4. వీణెలతో మనము నాణెమైన పాట ఋణము చెల్లింపలేమని యణఁ గి మణఁగి పాడుదుము ||మహిమతో||
