← కీర్తనలు

219. క్రీస్తు లేచెను

రాగం: యమన్ కళ్యాణి|తాళం: త్రిపుట|రచయిత: బి. సూర్య ప్రకాశరావు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
క్రీస్తు లేచెను హల్లెలూయ క్రీస్తు నన్నులేపును ఇద్దియె సునాద సత్యము ఇలను చాటుడి నిత్యము||
1.  మృతుల పునరుత్థాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో మృతులు లేతురు నేను లేతును నాదువరుసలో నిజమిది||
2.  పాపమరణ నరకబలములు ప్రభుని శక్తికి ఓడెను పాపినగు నను బ్రోవ క్రీస్తుని ప్రాణదాన ప్రభావము||
3.  మరణమా! నీముల్లు యెక్కడ? మరణమా! జయమెక్కడ? మరణమా! నీముల్లు విరిగెను మహిమ క్రీస్తులో నిప్పుడు ||
4.  శిలయు ముద్రయు బలిమికావలి గలిబిలాయెను రాత్రిలో ఇలయు పరమును కలుసుకొనియెను గెలుపునొందిన క్రీస్తులో ||
5.  మృతులు నీదగువారలందరు బ్రతికి లేతురు సత్యము ప్రేతలను జీవింపచేయును పృథివి క్రీస్తుని విజయము ||
6.  స్తుతియు మహిమయు ఘనత నీకె స్తుతికి పాత్రుడ రక్షకా స్వంత రక్తము చిందితివి నా స్వామి యిదెనా యంజలి ||