← కీర్తనలు

215. క్రీస్తు పునరుత్థానము

రాగం: మధ్యమావతి|తాళం: త్రిపుట|రచయిత: పురుషోత్తము చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి ||సుదతులార||
1.  ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర దేశమున మీతో ||సుదతులార||
2.  మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద మీరు వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||
3.  ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||