← కీర్తనలు

208. క్రీస్తుని యాశ్చర్యమైన మరణము

రాగం: ముఖారి|తాళం: త్రిపుట|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
హర్షమే యెంతో హర్షమే క్రీస్తును కార్యము హర్షమే యెంతో హర్షమే హర్షమే తద్భక్తవరులకు నద్భుతంబగు యేసు క్రియలా కర్షమై హృదయంబు నందలి కలుషముం ధ్వంసింపఁజేయు ||హర్షమే||
1.  ఆర్యుఁడై భాసిల్లు మన ప్రభు నార్త ధ్వనితో జీవమీయఁగ సూర్యరశ్మి దొలంగి యిరలై క్షోణియును గంపంబు నొందుట ||హర్షమే||
2.  మారణముఁ దానొందునయ్యెడ మంగళముగా మృతులనేకుల్ దారుణిం జీవించి మఱలను దామెరుసలేమందుఁ జొచ్చుట ||హర్షమే||
3.  పొరిపొరిం గాసించు చొక త స్కరుఁడు వధ్యాస్తంభమున న నర్మువ కోస్వామియన న్బ్రభు కరుణతో మోక్షం బొసంగుట ||హర్షమే||
4.  ఏలి కనువిడ సాలమోన్భూ పౌలు నా దేవాలయపు తెర జీలిపోవను రెండుగా జన జాల మాశ్చర్యమునఁ బొందుట ||హర్షమే||
5.  సిలువపై యేసున్ శపించిన ఖలులకై దేవునిఁ బితాయని పిలిచి వీరింగావు మంచును బ్రేమతో జీవంబు విడుచుట ||హర్షమే||
6.  నెయ్యమున విభుఁ డేసునాధుం డి య్యరులకై ప్రాణమీయఁగ వ్రయ్యలాయె ధరాధరంబులు నయ్యరాతులు భీతినొందుట ||హర్షమే||
7.  కీటకముతో సాటి యగునా ఘాటమగు పెనుబాటులెల్ల మాటికిని దామీట నేనిఁక మేటి జీవకిరీట మొందుట ||హర్షమే||