కీర్తనలు

182. సిలువలోని దైవ ప్రేమ

రాగం: ముఖారి|తాళం: త్రిపుట|రచయిత: బూదాల లైమన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ గా ||నెంతో||
1.  వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు నిన్ను మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా ||యెంతో||
2.  సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను ||ఎంతో||
3.  కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము ||నెంతో||
4.  నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ జూపినావా ||యెంతో||
5.  చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా ||యెంతో||
6.  అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా ||యెంతో||