కీర్తనలు

177. క్రీస్తు తన శ్రమలను గూర్చి ప్రవచించుట

రాగం: ఆనందభైరవి|తాళం: అట|రచయిత: పురుషోత్తమ చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు||
1.  యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు||
2.  నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేసు||
3.  మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని ||యేసు||