కీర్తనలు

161. యేసు ప్రేమను స్తుతించుట

రాగం: బిలహరి|తాళం: అట|రచయిత: తూపిలి బెంజిమిన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును పంతముగఁ దన ప్రాణమును పా పులకు నియ్యను వచ్చి సిలువను జచ్చి నను రక్షించె నహహా ||వింత||
1.  ప్రీతిగల మా ప్రభుని కృప బహు ప్రియముతోఁ జాటింతును సాధుగా నాకొఱకు సిలువను చాల శ్రమల భరించి చావు జ యించి నను రక్షించె నహహా ||వింత||
2.  పాడుఁడీ మా యేసు ప్రేమను వేఁడుఁడీ మదిఁ గూడుఁడీ పాడుఁడీ తన దివ్యరక్తము పాప క్రయముగ నిచ్చి శాపముఁ బాపి నను రక్షించె నహహా ||వింత||
3.  నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగ నాకియ్యను రక్తస్వేదము గార్చె నహహా నరక శాపముఁ ద్రుంచి యాపద నుంచి నను రక్షించె నహహా ||వింత||