కీర్తనలు

159. ద్రాక్షావల్లి, తీగెలు

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: ఎం.జే. రామాంజులు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ద్రాక్షావల్లిని నేను ద్రాక్షాతీగెలు మీరు అక్షయు డేసిటు బలికె అతిముదమునను వినరండి ||ద్రాక్షా||
1.  నాయందుండని తీగె నాశనమొందును నిజము నాశనమొందక మీరు నాయందుండుడి ఫలియింపన్ ||ద్రాక్షా||
2.  ఫలముల నివ్వని తీగె పనికిరాదని నరికి పారవేయంబడును నిరతము తధ్యము నిప్పులలో ||ద్రాక్షా||
3.  ఫలించు ప్రతి తీగె ఫలముల పెక్కుగ నివ్వన్ పరిశుద్ధి చేయబడున్ యెఱుగరే మీరది అనవరతం ||ద్రాక్షా||
4.  నాయందుండినగాని నయమగు కాపుండదిలన్ నాయందుండిన వాడు నాణ్యపు ఫలములనిచ్చు నాహా ||ద్రాక్షా||
5.  మీరు యేదియు చేయ లేరు నాకు వేరై వేరుగ మీరుండినచో వెంటనే యెండిపోయెదరు ||ద్రాక్షా||
6.  కాన యేసుని యందు మానకనుందుము స్వేచ్ఛన్ మాన్యుడేసుని పలుకుల్ మదిదలచెద మిల మరువకను ||ద్రాక్షా||