← కీర్తనలు

139. యేసు నామస్మరణ

రాగం: అవసావేరి|తాళం: ఆది|ఛాయ: భజో మధుర|రచయిత: పి. రవివర్మ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసే, భగవన్నామం భజింపను యేసే, భగవన్నామం భజింప నిరంతర ||మేసే||
1.  యేసే సుగుణం యేసే శాంతం యేసే మనశ్శాంతం యేసే మనశ్శాంతి భజింపను ||యేసే||
2.  యేసే ప్రేమం యేసే క్షేమం యేసే పరంధామం యేసే పరంధామ భజింపను ||యేసే||
3.  యేసే తెరవు యేసే పరువు యేసే సద్గురువు యేసే సద్గురువు భజింపను ||యేసే||
4.  యేసే నిత్యం యేసే సత్యం యేసే సుఖదాయం యేసే సుఖదాయ భజింపను ||యేసే||
5.  యేసే జీవం యేసే జ్ఞానం యేసే జగదీశం యేసే జగదీశం భజింపను ||యేసే||