కీర్తనలు

137. యేసు నామము మధురము

రాగం: మారవ|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు నామ మెంతో మధురం యేసు నామ మెంతో మధురం దోసములు మోసములు నాధ మొనరించు ప్రభు ||యేసు||
1.  స్వాంతమునకు శాంతి నిడును చింతలను భ్రాంతులను వింతలుగఁ ద్రుంచు ప్రభు ||యేసు||
2.  నెమ్మి జేయు కమ్మివేయు నమ్మికలు సొమ్ములుగ ముమ్మరము జేయు ప్రభు ||యేసు||
3.  ప్రేమ లెదుగ క్షేమ మొదపు కామ గుణ పామరతి లేమి చొరనీదు ప్రభు ||యేసు||
4.  మోక్ష దశకు సాక్ష్య మొసఁగు నక్షయ సురక్షణకు దక్షత వహించ ప్రభు ||యేసు||
5.  శీల మతుల పాలి వెతలఁ తూలఁ జనఁదోలి తన జాలి కనపరచు ప్రభు ||యేసు||