← కీర్తనలు

113. క్రీస్తు జన్మదినోత్సవము

రాగం: శంకరాభరణము|తాళం: ఆది|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక వింతయగు కీర్తనఁ బాడ వచ్చితిని సంతోషించుఁడి నాతో ||సంతో||
1.  అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిఁగింప దాని యా వేశముఁ దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాధుఁడు వచ్చెఁ బ్రకాశుండై భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతో||
2.  కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు మీరు ప్ర కాశింపను రండు మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె భక్తుల మనము సంతసించె ||సంతో||
3.  మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయములఁ దగులఁ ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్ధత్తము తిన్నగ నెరవేరె భక్తుల కన్ను లాస దీరె ||సంతో||
4.  ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని నాతోఁ పాడుచును నీ తరి దూరస్థుల కీ వార్తను నే తీరును నైనఁ దెలుపఁగ నాతురపడవలెను ||సంతో||
5.  పాపులపై దేవునికిఁ గలిగిన ప్రబలమైన దయను లోకమునఁ జూపింపఁ గవలెను జూపకపోయిన లోపము మనపై మోపఁబడును నిజము వేగము జూపుద మా పథము ||సంతో||