← కీర్తనలు

84. నీతి సూర్యుఁడు

రాగం: బేహాగ్|తాళం: ఏక|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||
1.  ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||
2.  నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||
3.  కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||
4.  మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||
5.  జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము ||ఇదిగో||