← కీర్తనలు

58. ప్రభు దినము

రాగం: యదుకుల కాంభోజి|తాళం: ఆది|రచయిత: పురుషోత్తమ చౌధరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||
1.  మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||
2.  అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||
3.  ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||
4.  సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||యిది||
5.  దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||