← కీర్తనలు

53. సాయంతన ప్రార్థన

రాగం: కాంభోజి|తాళం: ఆది|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||మీ||
1.  చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||యీ||
2.  దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||మీ||
3.  నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||యీ||
4.  జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||