← కీర్తనలు

51. సాయంతన స్తవము

రాగం: శంకరాభరణము|తాళం: త్రిపుట|ఛాయ: విమల హృదయము|రచయిత: దాసరి మోజెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము||
1.  సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||
2.  కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము||
3.  తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము||
4.  ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ ||దినము||
5.  ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||
6.  అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ ||దినము||
7.  అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము||
8.  దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక ||దినము||