కీర్తనలు

45. ప్రాతఃకాల ప్రస్తుతి

రాగం: నాధనామక్రియ|తాళం: ఆది|రచయిత: విలియం డాసన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద||
1.  ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద||
2.  నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద||
3.  పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ||వేఁడెద||
4.  నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ||వేఁడెద||
5.  అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు ||వేఁడెద||