← కీర్తనలు

41. ఉదయారాధన

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే||
1.  దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ ||మేలుకొనరే||
2.  పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ ||మేలుకొనరే||
3.  నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే||
4.  మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ ||మేలుకొనరే||
5.  తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే||