← కీర్తనలు

32. అర్పణ కీర్తన

రాగం: హిందూస్థాని తోడి|తాళం: త్రిపుట|ఛాయ: ఆహా, ఎంతటి త్రమలు|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన||
1.  నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన|
2.  అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||