← కీర్తనలు

24. సర్వము దేవుని సొత్తు

రాగం: హరికాంభోజి|తాళం: ఆది|ఛాయ: శుభకర సంఘంబుజడి|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ||
1.  యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ||
2.  యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ||
3.  అనుపల్లవి: విత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ||
4.  ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ||
5.  ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే ||భూ||
6.  ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి ||భూ||
7.  ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ ||భూ||