← కీర్తనలు

22. దేవుని ప్రభావ వర్ణన

రాగం: నాట|తాళం: అట|ఛాయ: యేసుక్రీస్తు దొరికెనేని|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ ||వ్యోమ||
1.  అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప నెంతది నా నాల్క చూప ||వ్యోమ||
2.  గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు ||వ్యోమ||
3.  నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా ||వ్యోమ||
4.  సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా వాహితా కావునాన్ని నాట పితా ||వ్యోమ||
5.  నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా ||వ్యోమ||