కీర్తనలు

17. దైవారాధన

రాగం: నాదనామక్రియ|తాళం: అట|రచయిత: యేసుదాసు నర్సయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి పోకండి ||యెహోవా||
1.  యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము ||యెహోవా||
2.  యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి ||యెహోవా||
3.  జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి ||యెహోవా||
4.  మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన మున మరవక తలఁచి ||యెహోవా||
5.  కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు నిపుడు కర్తకు నిచ్చి ||యెహోవా||