పల్లవి:
నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు నాదు దేవ యెపుడు నీకే వాని మీద నిత్యాధికారంబు నిల్చియుండు ||నా||
1. తల్లిగర్భంబున దసర సృజించితివి ధరణి నన్ను నీవు తల్లికన్నను మిగుల దయచేతఁ జూచితివి తండ్రి నన్ను ||నా||
2. పాప కూపమునందుఁ బడియుండఁగా నన్నుఁ బారఁజూచి చేయి చాపి యేసునిద్వార చక్కఁగాఁదెచ్చితివి చాలు దేవా ||నా||
3. సుఖఃదుఖ కాలములు శోధింపఁ బంపుదువు శోభాయుక్త నాకు సుఖముఁ గల్గజేయు సొంపుగ వానిచే స్థూల శక్తి ||నా||
4. సకల కాలంబులఁ జక్కఁగ లోఁబడి నన్నుతింతు నన్ను ఆకలంకునిగాఁ జేయు మనుచు వేఁడుచునుందు నధికాసక్తి ||నా||
